'కౌశల్ ఆర్మీ' పెయిడ్ ఆర్మీనా?.. చెప్పకనే చెబుతున్న నిజం... వైరల్ అవుతున్న వీడియో!

18-09-2018 Tue 11:28 | Offbeat
  • బిగ్ బాస్-2 కంటెస్టెంట్ గా కౌశల్
  • బయట ఆయనకు భారీ మద్దతు
  • పెట్రోలు కొట్టిస్తే వచ్చానంటున్న అభిమాని
కౌశల్ ఆర్మీ... టాలీవుడ్ బిగ్ బాస్ సీజన్-2 చూస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ ఈ పేరు సుపరిచితమే. హౌస్ లో ప్రధాన పోటీదారుగా, విజేతగా నిలిచే సత్తా ఉన్న వ్యక్తిగా ఉన్న కౌశల్ పేరిట బయట భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. కౌశల్ ఎన్నిమార్లు ఎలిమినేషన్ జోన్ లోకి వచ్చినా, కౌశల్ ఆర్మీ ఆన్ లైన్ లో ఓట్లు వేసి, ఆయనకు మద్దతుగా నిలుస్తూ, బయటకు రానీయకుండా కాపాడుతోంది. కౌశల్ గెలవాలని కోరుకుంటూ ఆయన మద్దతుదారులు ఇటీవల హైదరాబాద్, విజయవాడ నగరాల్లో భారీ ర్యాలీలు కూడా చేశారు.

ఇదే సమయంలో కౌశల్ ఆర్మీ ఓ పెయిడ్ ఆర్మీ అని ఇప్పటికే పలు ఆరోపణలు వచ్చాయి కూడా. తాజాగా విజయవాడలో కౌశల్ ఆర్మీ నిర్వహించిన 2కే రన్ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది. వందలాది మంది బైకులపై కౌశల్ గెలవాలని కోరుతూ, ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పించే పేరిట ర్యాలీ నిర్వహించారు. ఇదే ర్యాలీలో సీక్రెట్ గా కెమెరాను దాచుకున్న ఓ యువకుడు, కౌశల్ బొమ్మ ఉన్న టీ షర్టుతో వచ్చిన యువకుడిని ప్రశ్నించగా, సంచలన విషయాలను చెప్పాడతను.

తన బండిలో వచ్చేటప్పుడు 200 రూపాయలతో పెట్రోల్ కొట్టించారని, వెళ్లేటప్పుడు మరో 200కు కొట్టిస్తామన్నారని చెప్పాడు. మొత్తం పది మందిమి వచ్చామని, సాయంత్రం పార్టీ కూడా ఉందని అన్నాడు. ఇదంతా ప్రసాద్ అనే వ్యక్తి చేయిస్తున్నాడని చెప్పాడు. సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్న ఆ వీడియోను మీరూ చూడవచ్చు.


BiggbossKoushalKoushal ArmyPetrolVijayawadaRally

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more